Megastar Chiranjeevi's Bad Luck Continues With First Day First Show: మెగాస్టార్ చిరంజీవి సినిమాల్లో  రీ ఎంట్రీ ఇచ్చి  వరుస సినిమాలు చేస్తున్న సంగతి తెలిసిందే. చివరిగా ఆయన ఆచార్య అనే సినిమాతో తెలుగు ప్రేక్షకుల ముందుకు వచ్చి డిజాస్టర్ ఫలితాన్ని మూటగట్టుకున్నారు. తన కుమారుడు రామ్ చరణ్ తేజ కీలక పాత్రలో పూజ హెగ్డే హీరోయిన్ గా నటించిన ఆచార్య సినిమా కొరటాల శివ అలాగే మెగాస్టార్ చిరంజీవి, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ సహా సినిమాకు పనిచేసిన అందరికీ భారీ డిజాస్టర్ గా నిలిచింది.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

అయితే మెగాస్టార్ చిరంజీవి జడ్జిమెంట్ వ్యవహారాన్ని ఇప్పుడు పలువురు తప్పు పడుతున్నారు. ఆయన జడ్జి చేస్తున్న సినిమాల ఫలితాలు అన్నీ ఇలాగే ఉంటున్నాయని ఆయన నటిస్తున్న సినిమాల ఫలితాలు ఇక మీద ఎలా ఉండబోతున్నాయి అనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారిందని అంటున్నారు. ఇక ఆయన చీఫ్ గెస్ట్ గా వెళ్తున్నసినిమాలు కూడా డిజాస్టర్ ఫలితాలు అందుకుంటున్నాయి అనే విషయం మీద కూడా పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. ఈ మధ్యకాలంలో మెగాస్టార్ చిరంజీవి ఫ్రీ రిలీజ్ ఈవెంట్ కి చీఫ్ గెస్ట్ గా వెళ్లిన ఏ సినిమా కూడా సరైన ఆదరణ దక్కించుకోలేకపోయింది.


చిన్న సినిమాలను ప్రమోట్ చేసే ఉద్దేశంతో వారు పిలిచిన వెంటనే కాదనకుండా మెగాస్టార్ చిరంజీవి ఆయా సినిమా ఫంక్షన్లకు వెళ్లి సినిమాని ప్రమోట్ చేసే పనిలో ఉంటున్నారు. కానీ ఆయన దురదృష్టమో, లేక కాకతీయమో తెలియదు కానీ దాదాపు మెగాస్టార్ చిరంజీవి ఫ్రీ రిలీజ్ ఈవెంట్ కి ముఖ్య అతిథిగా హాజరైన అన్ని సినిమాలు డిజాస్టర్ ఫలితాలు అందుకుంటున్నాయి. ఆచార్య, లాల్ సింగ్ చద్దా, మిషన్ ఇంపాజిబుల్, పక్కా కమర్షియల్ సినిమాల జాబితాలో తాజాగా ఫస్ట్ డే ఫస్ట్ షో సినిమా కూడా నిలిచింది.


పిట్టగోడ సినిమాతో దర్శకుడిగా పరిచయమై జాతి రత్నాలు అనే సినిమాతో సూపర్ హిట్ అందుకున్న దర్శకుడు అనుదీప్ తన దగ్గర దర్శకత్వ శాఖలో పనిచేసిన వంశీ, లక్ష్మీనారాయణ అనే ఇద్దరిని దర్శకులుగా చేస్తూ ఈ సినిమా ప్లాన్ చేశారు. ఈ సినిమా యూనిట్ ముందు నుంచి కూడా భిన్నంగా ప్రమోషన్స్ చేస్తూ వచ్చింది. అయితే ఈ సినిమా బాక్స్ ఆఫీస్ ముందు పూర్తిగా బోల్తా పడే అవకాశాలు కనిపిస్తున్నాయి.


ఈ దశాబ్దంలోనే ఇది ఒక చెత్త సినిమా అంటూ సినిమా చూసిన వాళ్ళు కామెంట్స్ చేస్తున్న నేపథ్యంలో మెగాస్టార్ చిరంజీవి ఖాతాలో మరో దారుణ డిజాస్టర్ పడిందనే కామెంట్లు వినిపిస్తున్నాయి. ఆయనది ఐరెన్ లెగ్ అంటూ కూడా కొందరు నెటిజన్లు కామెంట్ చేస్తుంటే, మెగా అభిమానులు మాత్రం ఆయనకు మద్దతుగా కామెంట్ చేస్తున్నారు. ఈ సినిమాను సూపర్ హిట్ సినిమాల నిర్మాత ఏడిద నాగేశ్వరరావు మనవరాలు శ్రీజ, శ్రీజ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ మీద నిర్మించారు. ఈ సినిమాలో శ్రీకాంత్ రెడ్డి హీరోగా నటించగా, సోషల్ మీడియా ఫేమ్ సంచిత బసు హీరోయిన్ గా నటించింది. 


Also Read: Hiding OTT Partner Names: సినిమా టైటిల్స్ లో ఓటీటీ, శాటిలైట్ రైట్స్ దాపరికం.. పెద్ద ప్లానే ఇది!


Also Read: Ranga Ranga Vaibhavanga Review: 'రంగ రంగ వైభవంగా' టైటిల్ కు తగినట్టుగానే ఉందా?



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


Android Link https://bit.ly/3P3R74U


Apple Link - https://apple.co/3loQYe 


Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి